logo

యువతను మత్తు బారిన పడనీయొద్దు

మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు సర్వనాశనమవుతాయనీ.. ముఖ్యంగా యువత, విద్యార్థులు వీటి బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని

Published : 27 Jun 2022 02:17 IST

పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్‌) నాగేశ్వరరావు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు సర్వనాశనమవుతాయనీ.. ముఖ్యంగా యువత, విద్యార్థులు వీటి బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్‌) కె.నాగేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. తొలుత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు బానిసలైన కొందరు యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. వీటి వాడకంతో ఆలోచన మందగించి, విచక్షణా శక్తి నశించి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. డబ్బు సంపాదించాలనే దురాశతో యువతను వ్యసనాలకు బానిసలుగా మారుస్తున్న వారిని పోలీసు శాఖ ఉపేక్షించబోదనీ, కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ బి.మరియదాసు, ఏఆర్‌ డీఎస్పీ రాఘవేంద్ర, ఆర్‌ఐ శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని