logo

పార్టీ కార్యాలయమా... పోలీసు స్టేషనా!

ఒంగోలు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో వైకాపా నాయకుల మధ్య సీఐ వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చర్చనీయాంశమైంది. ఓ వైకాపా కార్పొరేటర్‌, మరో ఇద్దరు అదే పార్టీ కార్పొరేటర్ల భర్తలు, వారి

Published : 09 Aug 2022 01:43 IST

వైకాపా నాయకుల మధ్య సీఐ జన్మదిన వేడుకలు

వైకాపా కార్పొరేటర్‌, నాయకుల మధ్య కేక్‌ కట్‌ చేస్తున్న ఒకటో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు

న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం: ఒంగోలు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో వైకాపా నాయకుల మధ్య సీఐ వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చర్చనీయాంశమైంది. ఓ వైకాపా కార్పొరేటర్‌, మరో ఇద్దరు అదే పార్టీ కార్పొరేటర్ల భర్తలు, వారి అనుచరులు, ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ ప్రతినిధి నడుమ ఆయన కేకు కట్‌ చేశారు. వారంతా శాలువాతో సత్కరించారు. పరస్పరం కేకు తినిపించుకున్నారు. ఇదే స్టేషన్లో అక్కడ పనిచేసే మహిళా సిబ్బందికి గతంలో సీమంతాలు నిర్వహించిన ఉదంతాలు ఉన్నాయి. కానీ వాటిలో కేవలం పోలీసు అధికారులు, సిబ్బంది మాత్రమే పాల్గొనేవారు. రాజకీయాలకూ, నాయకులకూ ప్రమేయం ఉండేది కాదు. ఇప్పుడు నిర్వహించిన జన్మదిన వేడుక పార్టీ కార్యక్రమం మాదిరి కనిపించడంతో అది వైకాపా కార్యాలయమా.! పోలీసు స్టేషనా.?? అన్న చర్చ నడిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని