logo

అక్రమ రహదారి తొలగింపు

గిద్దలూరులోని జగనన్న కాలనీలో స్థలాన్ని ఆక్రమించి ఓ స్థిరాస్తి వ్యాపారి వేసిన రహదారిని మంగళవారం నగర పంచాయతీ, రెవెన్యూ అధికారులు తొలగించారు. ‘జగనన్న కాలనీని వదల్లేదు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమవడంతో

Published : 28 Sep 2022 02:25 IST

యంత్రంతో  రహదారిని తొలగిస్తున్న అధికారులు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : గిద్దలూరులోని జగనన్న కాలనీలో స్థలాన్ని ఆక్రమించి ఓ స్థిరాస్తి వ్యాపారి వేసిన రహదారిని మంగళవారం నగర పంచాయతీ, రెవెన్యూ అధికారులు తొలగించారు. ‘జగనన్న కాలనీని వదల్లేదు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమవడంతో అధికారులు స్పందించారు. ఒంగోలు-నంద్యాల రహదారిలో ఏర్పాటుచేసిన కాలనీలో స్థిరాస్తి వ్యాపారి సుమారు 30 సెంట్ల మేర నగర పంచాయతీ స్థలం ఆక్రమించి రోడ్డు వేసినట్లు గుర్తించారు. దాని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.80 లక్షలు ఉంటుంది. కమిషనర్‌ వై.రామకృష్ణయ్య, తహసీల్దారు రాజా రమేష్‌, పట్టణ ప్రణాళికా విభాగం అధికారి సతీష్‌, సర్వేయర్‌ తదితరులు ఆ రహదారిని తొలగించాలని సిబ్బందికి సూచించారు. అక్రమ లేఅవుట్‌లోకి జగనన్న కాలనీలోంచి రోడ్డు లేదని స్పష్టంచేశారు. కాలనీ ఆక్రమణకు గురికాకుండా చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు కమిషనర్‌ తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని