logo

ఇసుక కొరత లేకుండా చర్యలు

జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు గనులశాఖ అధికారులు తెలిపారు. కొరత కారణంగా జిల్లాలో తలెత్తుతున్న ఇక్కట్లపై ‘ష్‌...ఇసుక అడగవద్దు’ శీర్షికన గత నెల 31న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి డీడీ జగన్నాథరావు స్పందిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Published : 03 Feb 2023 02:05 IST

గుండ్లకమ్మలోనూ తవ్వకాలకు అనుమతి

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు గనులశాఖ అధికారులు తెలిపారు. కొరత కారణంగా జిల్లాలో తలెత్తుతున్న ఇక్కట్లపై ‘ష్‌...ఇసుక అడగవద్దు’ శీర్షికన గత నెల 31న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి డీడీ జగన్నాథరావు స్పందిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 4న 19 ఇసుక రీచ్‌లు గుర్తించి... జిల్లా శాండ్‌ కమిటీ తనిఖీ నివేదిక కోరామన్నారు. అది వచ్చిన వెంటనే ఆయా ప్రాంతాల్లో తవ్వకాలకు అనుమతులు ఇస్తామన్నారు. ఒంగోలు1, 2, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరిలోని నిల్వ కేంద్రాల్లో 83,301 టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నందున కొరత లేదన్నారు. గుండ్లకమ్మ జలాశయంలో ఇసుక తవ్వకాలపై స్పందిస్తూ... రిజర్వాయర్‌లోని ఇసుక మేటల ద్వారా 1.14 లక్షల టన్నుల తవ్వకాలకు జేపీ వెంచర్స్‌కు అనుమతులు లభించాయన్నారు. ఆ మేరకు జిల్లా శాండ్‌ కమిటీ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. త్వరలోనే తవ్వకాలు ప్రారంభమవుతాయని... తద్వారా ప్రజావసరాలకు, ప్రభుత్వ పథకాల పనులకు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


ఎట్టకేలకు బియ్యం ఇచ్చారు

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరి మండలం బుడ్డాయపల్లి వాసులకు గత మూడు నెలలుగా రేషన్‌ బియ్యం ఇవ్వడం లేదు. ఈ విషయమై కొందరు గ్రామస్థులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘3 నెలలు... కిలో బియ్యమూ ఇవ్వలేదు’ శీర్షికన గురువారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన తహసీల్దార్‌ వి.పుల్లారావు... గ్రామానికి ఆర్‌ఐని పంపి బియ్యం సరఫరా చేయించారు. ప్రతి నెలా బియ్యం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని డీలర్‌ను హెచ్చరించారు. రేషన్‌ వాహనం కూడా అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని... వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని