logo

ఉద్యోగుల ‘వర్క్‌ టు రూల్‌’

ఏపీ ఐకాస అమరావతి పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగులు శుక్రవారం వర్క్‌ టూ రూల్‌ పాటించారు. సమయపాలన ప్రకారం ఉదయం 10.30 గంటలకు విధులకు హాజరైన ఉద్యోగులు... సాయంత్రం అయిదు గంటలకు కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.

Published : 01 Apr 2023 04:12 IST

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీ ఐకాస అమరావతి పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగులు శుక్రవారం వర్క్‌ టూ రూల్‌ పాటించారు. సమయపాలన ప్రకారం ఉదయం 10.30 గంటలకు విధులకు హాజరైన ఉద్యోగులు... సాయంత్రం అయిదు గంటలకు కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఉద్యోగులు కలెక్టరేట్‌ ఆవరణలో కొద్దిసేపు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీఆర్‌ఎస్‌ఏ కలెక్టరేట్‌ యూనిట్‌ అధ్యక్షుడు ఊతకోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏప్రిల్‌ అయిదో తేదీ వరకు వర్క్‌ టు రూల్‌ పాటించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానం తీసుకురావాలని కోరారు. ప్రతి నెలా ఒకటో తేదినే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంతో పాటు... ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని