అనాథ శవంలా అయిదు రోజులు
ఒంటరి వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో అయిదు రోజులపాటు మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది.
మహాలక్ష్మి (పాత చిత్రం)
నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: ఒంటరి వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో అయిదు రోజులపాటు మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు ఎస్టీ కాలనీలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సాధు మహాలక్ష్మి(59) అనే వృద్ధురాలు స్థానిక బస్టాండ్ కూడలిలో వేరుసెనగకాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎస్టీ కాలనీలోని చిన్న రేకుల షెడ్డులో నివాసముంటున్నారు. వృద్ధాప్య పింఛను లబ్ధిదారులు అయినందున సంబంధిత నగదు అందజేసేందుకు స్థానిక వాలంటీర్ సోమవారం ఆమె నివాసానికి వెళ్లగా కనిపించలేదు. కరవదిలో ఉంటున్న వృద్ధురాలి కుమార్తెకు ఫోన్ చేసి విషయం తెలిపారు. ఆమె ఉప్పుగుండూరు వచ్చి ఇంటి తలుపులు తెరవడంతో కుళ్లి, పురుగులు పట్టి విగతజీవిగా మహాలక్ష్మి కనిపించారు. ఆమె భర్త శేషగిరి మూడేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి మానసికంగా కుంగుబాటుకు గురయ్యారు. నివాసం మిగతా ఇళ్లకు దూరంగా ఉండడంతో స్థానికులు కూడా విషయాన్ని గుర్తించలేకపోయారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య