261 మంది ప్రధానోపాధ్యాయుల బదిలీ
ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రధానోపాధ్యాయులకు కొత్త స్థానాలు కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులిచ్చారు. మొత్తం 261 మందిలో 47 మంది స్కూల్ అసిస్టెంట్ నుంచి ఉద్యోగోన్నతులు పొందినవారున్నారు. మిగిలినవారు ఒకే పాఠశాలలో 8 సంవత్సరాల సర్వీసు పూర్తయినవారు.
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రధానోపాధ్యాయులకు కొత్త స్థానాలు కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులిచ్చారు. మొత్తం 261 మందిలో 47 మంది స్కూల్ అసిస్టెంట్ నుంచి ఉద్యోగోన్నతులు పొందినవారున్నారు. మిగిలినవారు ఒకే పాఠశాలలో 8 సంవత్సరాల సర్వీసు పూర్తయినవారు. వీరందరూ వెంటనే విధుల్లోకి చేరాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో గురువారమే దాదాపు 90 శాతం మంది కొత్త స్థానాల్లో చేరారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీ ఉత్తర్వులు శుక్రవారం వెలువడనున్నాయి. ఆ కేటగిరీలో ఇరవై మంది దరఖాస్తు చేయడంలో కొన్ని తప్పులు చేశారు. వీటిని సవరించడానికి డీఈవో కార్యాలయం నుంచి తగిన సమాచారం పంపించారు. క్రమబద్ధీకరణలో పోస్టు ఉంటున్నప్పటికీ లేనట్టు కొందరు నమోదు చేశారు. అలాంటివాటిని సవరించి తాజా జాబితా ప్రకారం బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్‌సీసీ, స్క్వౌట్స్ ఏడుగురికి బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఈ మొత్తం ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నాటికి పూర్తవనుండగా.. 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్