logo

18,22,470 మంది చేతుల్లో భవిత

మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది.

Published : 27 Apr 2024 06:00 IST

 జిల్లాలో తేలిన నిర్ణేతలు
 కీలకం కానున్న మహిళలు 

మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం ఓటర్ల తుది జాబితాను ప్రచురించారు. మృతులు, వలసలు, డబల్‌ నమోదు, ఇతరత్రా అనర్హుల తొలగింపులపై దృష్టి పెట్టిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం.. నియోజకవర్గాల వారీగా తుది జాబితా ప్రచురణకు కసరత్తు పూర్తి చేసింది. ఈసీ ఆదేశాల మేరకు తుది జాబితాలను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు అందజేయనున్నారు.  

- న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం


  •  ఈ ఏడాది జనవరి 22న ఓటర్ల తుది జాబితా-2024 విడుదల చేశారు. సదరు జాబితా ప్రకారం మొత్తం 17,99,706 మంది ఉండగా, అందులో 8,96,859 మంది పురుషులు, 9,02,749 మంది మహిళలు, ఇతరులు మరో 98 మంది.
  • అక్టోబర్‌ 27న ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం 17,80,145 మంది ఓటర్లున్నారు.
  •  తాజాగా వెల్లడించిన తుది జాబితా ప్రకారం ఆ సంఖ్య 18,22,470కి చేరింది. వీరిలో 9,07,980 మంది పురుషులు, 9,14,379 మంది మహిళలు, ఇతరులు మరో 111 మంది. పురుషుల కంటే మహిళలు 6,399 మంది అధికం.
  •  జనవరి 22న ప్రకటించిన తుది జాబితాతో పోలిస్తే తాజాగా 22,764 మంది పెరిగారు.
  •  జిల్లాకు చెందిన సర్వీసు ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వనున్నారు.
  •  ఒంగోలు నియోజకవర్గంలో అత్యధికంగా, యర్రగొండపాలెం నియోజకవర్గంలో అత్యల్ప సంఖ్యలో ఓటర్లున్నారు.
  •  తుది జాబితా ప్రకటన అనంతరం ఈ నెల 15వ తేదీ వరకు ఓటర్ల చేర్పులకు దరఖాస్తులు స్వీకరించారు. తద్వారా వాటిని బీఎల్వోలు క్షేత్రస్థాయిలో విచారించి ఓటుహక్కుకు సిఫార్సు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని