logo

చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు

చెల్లని చెక్కు కేసులో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. సీఎస్‌పురం మండలం అరివేముల గ్రామానికి చెందిన అన్నపురెడ్డి పరమేశ్వరరెడ్డి వెలిగండ్ల మండలం

Published : 30 Apr 2024 03:29 IST

కనిగిరి: చెల్లని చెక్కు కేసులో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. సీఎస్‌పురం మండలం అరివేముల గ్రామానికి చెందిన అన్నపురెడ్డి పరమేశ్వరరెడ్డి వెలిగండ్ల మండలం తమ్మినేని పల్లికి చెందిన కఠారి సిద్ధారెడ్డి నుంచి రూ. 3.7 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అందుకు సంబంధించి చెక్కు ఇవ్వగా, అది చెల్ల లేదు. దీంతో సిద్ధారెడ్డి కేసు వేశారు. దీనిపై న్యాయ విచారణ జరగ్గా, చెక్కు బౌన్స్‌ అయినట్లు తేలడంతో నిందితుడు పరమేశ్వరరెడ్డికి కనిగిరి జూనియర్‌ సివిల్‌ జడ్జి భరత్‌ చంద్ర ఏడాది జైలుశిక్ష, రూ. 3.7 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని