logo

కార్మికుల పనివేళలు రీ షెడ్యూల్‌ చేయాలి

జిల్లాలో ఉష్ణోగ్రతలు, వడగాలులు అధికంగా ఉన్నందున వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల పనివేళలను రీ షెడ్యూల్‌ చేయాలని కార్మికశాఖ ఉప కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ కుమార్‌ తెలిపారు.

Published : 02 May 2024 02:04 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో ఉష్ణోగ్రతలు, వడగాలులు అధికంగా ఉన్నందున వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల పనివేళలను రీ షెడ్యూల్‌ చేయాలని కార్మికశాఖ ఉప కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ కుమార్‌ తెలిపారు. రోజు వారీ భవన నిర్మాణ కార్మికులు, సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల రక్షణకు ఇటుకల బట్టీలు, దుకాణాలు, సంస్థలు, పరిశ్రమల యజమానులకు పలు మార్గదర్శకాలు, సూచనలు జారీ చేశామన్నారు. పని ప్రదేశాల్లో అవసరాల మేరకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, భవన నిర్మాణ కార్మికులకు అత్యవసర ఐస్‌ ప్యాక్స్‌ అందించాలని సూచించారు. ఆరోగ్యశాఖ సమన్వయంతో కార్మికులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్మికశాఖ ఆదేశాలను ప్రతి ఒక్క యజమాని పాటించాలని సూచించారు. కార్మికులకు ఉపశమనం కల్పించే కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని