logo

ఓటమి భయం.. తపాలా ఓట్లకు గాలం

ఓటమి భయం వైకాపాను వెంటాడుతోంది. ఉద్యోగుల్లో ఆ పార్టీపై పూర్తి వ్యతిరేకత ఉండటం అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. దీంతో ప్రలోభాల పరంపరను మరింత ముమ్మరం చేసింది. తమ నాయకుల ద్వారా ఆ పార్టీలోని కొందరు అనుకూల ఉద్యోగ, ఉపాధ్యాయులతో ఇతరుల ఓట్లకు గాలం వేస్తోంది.

Published : 02 May 2024 02:09 IST

కనిగిరి, న్యూస్‌టుడే

ఓటమి భయం వైకాపాను వెంటాడుతోంది. ఉద్యోగుల్లో ఆ పార్టీపై పూర్తి వ్యతిరేకత ఉండటం అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. దీంతో ప్రలోభాల పరంపరను మరింత ముమ్మరం చేసింది. తమ నాయకుల ద్వారా ఆ పార్టీలోని కొందరు అనుకూల ఉద్యోగ, ఉపాధ్యాయులతో ఇతరుల ఓట్లకు గాలం వేస్తోంది. ఇందుకుగాను గంపగుత్తగా చెల్లించేలా బేరసారాలకు దిగుతున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారికి నియోజకవర్గాలను కూడా అధికారులు కేటాయించారు. తమ పరిధిలోకి ఎవరెవరు వచ్చారనే విషయాన్ని తెలుసుకున్న వైకాపా నేతలు బేరసారాలకు దిగుతున్నారు. ఒక్కొక్కరికి రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. ఈ క్రమంలో వారికి చేదు అనుభవాలు కూడా ఎదురవుతున్నాయి. అయిదేళ్ల వైకాపా పాలనలో అనుభవించిన కష్టాలు, ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ పలువురు ఉద్యోగులు సదరు అభ్యర్థులకు తాము ఓటేసేది లేదని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. మరికొందరు చూద్దాంలే అంటూ ప్రస్తుతానికి దాట వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు