logo

జై చెన్నకేశవా.. జైజై చెన్నకేశవా

నాలుగు యుగాల దేవుడిగా భక్తుల నుంచి పూజలందుకునే మార్కాపురం పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా సాగింది. తొలుత శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.

Published : 02 May 2024 02:10 IST

శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవస్వామి

నాలుగు యుగాల దేవుడిగా భక్తుల నుంచి పూజలందుకునే మార్కాపురం పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా సాగింది. తొలుత శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. వేద మంత్రాల మధ్య తోడ్కొని వచ్చి రథంపై కొలువుదీర్చారు. అనంతరం అశేష భక్త జనవాహిని మధ్య స్వామివారి రథోత్సవం మాఢ వీధుల్లో కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా జై చెన్నకేశవ.. జైజై చెన్నకేశవా అంటూ భక్తులు చేసిన జయ జయ ధ్వానాలతో మాఢ వీధులు మార్మోగాయి. ఉత్సవాన్ని తిలకించేందుకు పట్టణంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వేల మంది మధ్య ఉత్సవం దాదాపు రెండు గంటల పాటు సాగింది.

అశేష భక్త జనం మధ్య మాఢ వీధుల్లో సాగుతున్న రథోత్సవం... 

న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు