logo

ఏలికా.. మా ఉసురు తగలదా!

ఎన్నికల వేళ లబ్ధికి జగన్‌ తెర లేపిన వికృత రాజకీయ క్రీడకు పండుటాకులు విలవిల్లాడుతున్నారు. ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే అవ్వాతాతలను బ్యాంక్‌లకు రప్పించారు.

Published : 04 May 2024 06:29 IST

వైకాపా కుట్రకు పండుటాకుల విలవిల
రెండో రోజూ బ్యాంక్‌ల వద్ద పడిగాపులు

సర్వర్‌ సేవలు నిలిచిపోయాయని బోర్డు పెట్టడంతో పెద్దదోర్నాల స్టేట్ బ్యాంకు ఎదుట దీనంగా కూర్చుని ఉన్న చెంచు గిరిజన వృద్ధులు

ఒంగోలు గ్రామీణం, పెద్దదోర్నాల- న్యూస్‌టుడే: ఎన్నికల వేళ లబ్ధికి జగన్‌ తెర లేపిన వికృత రాజకీయ క్రీడకు పండుటాకులు విలవిల్లాడుతున్నారు. ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే అవ్వాతాతలను బ్యాంక్‌లకు రప్పించారు. ఇంటింటికీ పింఛన్లు సులభమైనా ససేమిరా అంటూ మండుటెండల్లో కిలో మీటర్ల దూరం నడిపించారు. ఎర్రని ఎండలో గంటలపాటు పడిగాపులు పడేలా చేశారు. రెండో రోజైన శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఇవే దృశ్యాలు కనిపించాయి. బ్యాంకింగ్‌ సేవలపై అవగాహన లేకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఎవరో ఒకరు వచ్చి సాయం చేసే వరకు నిరీక్షించారు. మరికొన్ని చోట్ల సర్వర్‌ సమస్యతో పడిగాపులు పడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే వైకాపా ప్రభుత్వం తమను ముప్పుతిప్పలు పెడుతోందని.. మా ఉసురు పాలకులకు తగలకుండా పోతుందా అని పింఛను లబ్ధిదారులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని