logo

ఓటుకు వందనం

సార్వత్రిక ఎన్నికల వేళ ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఇంటికే పరిమితమైన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది.

Published : 08 May 2024 04:29 IST

సార్వత్రిక ఎన్నికల వేళ ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఇంటికే పరిమితమైన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ఇందులో భాగంగా టంగుటూరుకు చెందిన శతాధిక వృద్ధులైన కామని రామయ్య, శేషారత్నం దంపతులు మంగళవారం ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాము ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేస్తామని.. ఈసారి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేనందున ఎన్నికల కమిషన్‌ కల్పించిన అవకాశంతో ఇంటి వద్దనే ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణతో హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.

న్యూస్‌టుడే, టంగుటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు