logo

జీతాలు తీసుకుంటూ.. వైకాపా సేవలో తరిస్తూ..

ప్రభుత్వం నుంచి ఆర్థిక లబ్ధి పొందుతున్న ఉద్యోగులు రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలన్న నిబంధనను కొందరు పెడచెవిన పెడుతున్నారు.

Published : 09 May 2024 03:17 IST

ప్రచారాల్లో వాలంటీర్‌, డీలర్‌

మార్కాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వం నుంచి ఆర్థిక లబ్ధి పొందుతున్న ఉద్యోగులు రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలన్న నిబంధనను కొందరు పెడచెవిన పెడుతున్నారు. వైకాపా అసెంబ్లీ, పార్లమెంట్‌ అభ్యర్థులైన అన్నా రాంబాబు, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలకు ఓట్లు వేయాలని బుధవారం వేములపేట గ్రామంలో బుధవారం ప్రచారం నిర్వహించారు. దీనిలో గ్రామానికి చెందిన  వాలంటీరు జూపల్లి శేఖర్‌ బ్యాలెట్‌ నమూనాతో ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఒక పక్క వాలంటీర్లు ప్రచారంలో పాల్గొన్నకూడడని ఎన్నికల కమిషన్‌ చెబుతున్నా వారిలో మార్పు రావడం లేదు. అధికారులు చర్యలు తీసుకుంటున్నా అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు.


యర్రబాలెంలో...

కంభం : ప్రభుత్వం నుంచి వేతనం, గౌరవ వేతనం తీసుకునేవారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదన్న నిబంధనలు పలువురు కాలరాస్తున్నారు. తాజాగా మండలంలోని యర్రబాలేనికి చెందిన రేషన్‌ డీలర్‌ చేగిరెడ్డి చంద్రకళ వైకాపా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నెల 5న గ్రామంలో వైకాపా ఇన్‌ఛార్జి కుందూరు నాగార్జునరెడ్డి సోదరుని సతీమణి కోమలతారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటుగా డీలర్‌ చంద్రకళ అందులో పాల్గొన్న విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని