logo

స్ట్రాంగ్‌రూమ్‌లను రోజూ సందర్శించండి

ఈవీఎంలకు పటిష్ఠమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

Published : 18 May 2024 04:57 IST

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌, జేసీ గోపాలకృష్ణ, ఎన్నికల అధికారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఈవీఎంలకు పటిష్ఠమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద విద్యుత్తు సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. స్ట్రాంగ్‌ రూములను కలెక్టర్‌, ఎస్పీ ప్రతిరోజూ సందర్శించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌, జేసీ గోపాలకృష్ణ, డీఆర్వో శ్రీలత, ఆర్వోలు సుబ్బారెడ్డి, లోకేశ్వరరావు, నాగజ్యోతి, జాన్‌ ఇర్విన్‌, శ్రీకుమార్‌, కలెక్టరేట్‌ ఏవో శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని