logo

మొలకలొస్తున్నాయి.. కొనండయ్యా!

చిత్రంలో కన్పిస్తున్న రైతు పేరు దాసరి అప్పలనాయుడు. వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామానికి చెందిన ఈ రైతు ఐదు ఎకరాల్లో ధాన్యం పండించి ఇదిగో ఇలా రాసిపోసి నెలరోజులు దాటింది. ఇటీవల వర్షాలకు అడుగున తడిచిపోయి ఇలా మొలకలు వచ్చేసింది.

Published : 18 Jan 2022 06:20 IST

చిత్రంలో కన్పిస్తున్న రైతు పేరు దాసరి అప్పలనాయుడు. వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామానికి చెందిన ఈ రైతు ఐదు ఎకరాల్లో ధాన్యం పండించి ఇదిగో ఇలా రాసిపోసి నెలరోజులు దాటింది. ఇటీవల వర్షాలకు అడుగున తడిచిపోయి ఇలా మొలకలు వచ్చేసింది. మొలకలొచ్చిన ధాన్యాన్ని చూపిస్తూ.. అయ్యా ఇప్పటికే చాలా నష్టపోయాం.. ఇకనైనా ధాన్యం కొనండయ్యా అంటూ అధికారులను మొరపెట్టుకుంటున్నాడు.

ఒక్క గింజా కొనలేదు..: గ్రామంలో 34 ఎకరాల్లో రైతులు వరి వేశారు. నూర్చిన ధాన్యాన్ని కొన్ని రోజులుగా కల్లాల్లో నిల్వ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క రైతు నుంచీ ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు కొంత తడిసి మొలకలొచ్చిందని.. కొంత నీరుచేరి మట్టిలో కలిసిపోయిందని రైతులు వాపోతున్నారు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ ఇలా కన్పించారు. పండించిన ధాన్యాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నామని.. అధికారులు మాత్రం తమపై దయ చూపడం లేదని ఆరోపించారు.

వెంటనే కొంటాం: గ్రామంలో పరిస్థితిని ‘న్యూస్‌టుడే’ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన తహసీల్దార్‌ ఎన్‌.అప్పారావు, వ్యవసాయశాఖాధికారి ఎం.అశోక్‌ వెంటనే గ్రామానికి వెళ్లి పరిశీలించారు. పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. వెంటనే ధాన్యం కొని, తరలించే ఏర్పాట్లు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దెబ్బతిన్న ధాన్యానికి కూడా సాంకేతిక పరీక్షల అనంతరం ధర నిర్ణయించి కొంటామన్నారు. - న్యూస్‌టుడే, వీరఘట్టం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని