logo

ఆధారాలతో కేసులను దర్యాప్తు చేయాలి: ఎస్పీ

పక్కా సాక్ష్యాధారాలతో ప్రతి కేసును దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ అమిత్‌బర్దార్‌ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జూమ్‌ యాప్‌ ద్వారా నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని

Published : 23 Jan 2022 03:52 IST

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: పక్కా సాక్ష్యాధారాలతో ప్రతి కేసును దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ అమిత్‌బర్దార్‌ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జూమ్‌ యాప్‌ ద్వారా నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ నియమ నిబంధనలు పాటించని వారికి అపరాధరుసుం విధించాలని సూచించారు. పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కరించాలని చెప్పారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, అనుమానం వస్తే బైండోవర్‌ కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్‌ చేయాలని చెప్పారు. మాదక ద్రవ్యాల రవాణా, అమ్మకం, సరఫరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీలు పి.సోమశేఖర్‌, విఠలేశ్వరరావు, డీసీఆర్‌బీ దుర్గాప్రసాద్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని