logo

విజిలెన్స్‌ దాడుల్లో బియ్యం పట్టివేత

మెట్టూరు బిట్‌-1 నిర్వాసిత కాలనీలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలు ఉన్న గోదాంపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. 50 కిలోల బియ్యం బస్తాలు 40 ఉన్న వ్యాన్‌ కొత్తూరు మండలం నుంచి తరలుతున్నట్లు శనివారం సమాచారం

Published : 23 Jan 2022 03:52 IST

వివరాలు నమోదు చేసుకుంటున్న విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు

కొత్తూరు, న్యూస్‌టుడే: మెట్టూరు బిట్‌-1 నిర్వాసిత కాలనీలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలు ఉన్న గోదాంపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. 50 కిలోల బియ్యం బస్తాలు 40 ఉన్న వ్యాన్‌ కొత్తూరు మండలం నుంచి తరలుతున్నట్లు శనివారం సమాచారం అందుకొని దాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకొని డ్రైవర్‌ను ప్రశ్నించగా వివరాలు వెల్లడయ్యాయి. దీంతో విజిలెన్స్‌ ఎస్సై రామారావు, టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో బృందం ఈ నిర్వాసిత కాలనీలో ఉన్న పి.ఉమామహేశ్వరరావుకు చెందిన గోదాం వద్దకు చేరుకొని నిల్వ ఉన్న బియ్యం బస్తాలను పరిశీలించారు. పెద్ద సంఖ్యలో 50 కిలోల బియ్యం బస్తాలు నిల్వ ఉండటాన్ని గుర్తించారు. రెవెన్యూ అధికారులకు ఈ మేరకు సమాచారం అందించారు. తహసీల్దార్‌ సురేష్‌ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. 50 నుంచి 60 టన్నుల వరకు బియ్యం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం నాటికి పూర్తిస్థాయి లెక్కింపు చేపట్టి, కేసు నమోదు చేస్తామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని