logo

తీర్చలేని కష్టాలా ఇవి!

రిజర్వాయర్‌ నిర్మాణం కారణంగా నాలుగేళ్ల కిందట సొంత గ్రామాల నుంచి 24 వేల మంది ప్రజలు బయటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఎల్‌ఎన్‌పేట మండలంలో శ్యామలాపురం, మోదుగులవలస,...

Published : 29 Jan 2022 05:24 IST

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, హిరమండలం

రిజర్వాయర్‌ నిర్మాణం కారణంగా నాలుగేళ్ల కిందట సొంత గ్రామాల నుంచి 24 వేల మంది ప్రజలు బయటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఎల్‌ఎన్‌పేట మండలంలో శ్యామలాపురం, మోదుగులవలస, జగన్నాథపురం, తాయమాంబపురం, ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస, కొత్తూరు మండలం గూనభద్ర, మెట్టూరు, మహసింగి, సీతంపేట పులిపుట్టి, హిరమండలంలో సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీల్లో స్థిరపడ్డారు. ప్రభుత్వం స్థలాలు కేటాయించి నిర్వాసితులకు మంజూరు చేసింది. చాలా మంది ఇళ్లు కట్టుకోగా, స్థోమతు లేనివారు మాత్రం అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. కాలనీల్లో రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు, విద్యుత్తు, తదితర మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఈ విషయంలో నిర్వాసితుల పట్ల అధికారులు నాలుగేళ్లుగా ఉదాసీీనత చూపుతూనే ఉన్నారు.

నిర్వాసిత గ్రామాల సంఖ్య 19 (హిరమండలంలో 13, కొత్తూరులో 5, ఎల్‌ఎన్‌పేటలో 1)

నిర్వాసిత కుటుంబాలు 8,102

జనాభా 24 వేలు

ప్రత్యేక దృష్టి సారిస్తాం..

ఆర్‌ఆర్‌ కాలనీల్లో సమస్యలు ఉన్నమాట వాస్తవమే. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తాను. తక్షణమే కాలనీల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను.

- శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, కలెక్టర్‌

సమస్యలు పరిష్కరించాలి

నిర్వాసిత కాలనీల్లో తాగునీరు, విద్యుత్తు సమస్యలు వేధిస్తున్నాయి. కొన్నిచోట్ల కనీసం రహదారులూ లేవు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్వగ్రామాలను వదులుకున్న మా నిర్వాసితులను కనీసం పట్టించుకోకపోవడం దారుణం. ఇప్పటికైనా అధికారులు మా కాలనీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి.

- పి.సాధుబాబు, వై.ధర్మారావు, గూనభద్ర ఆర్‌ఆర్‌ కాలనీ, మెట్టూరు బిట్‌-2 సర్పంచులు


తాయమాంబపురం (గార్లపాడు) ఆర్‌ఆర్‌ కాలనీలో రక్షిత నీటిపథకం నెలలుగా పనిచేయడం లేదు. కాలనీకి తాగునీరే సక్రమంగా సరఫరా కావడం లేదు. నిర్వాసితుల కాలనీల్లో పలు పథకాలది ఇదే పరిస్థితి. ప్రజలు డబ్బా నీరు కొనుక్కుని తాగాల్సిన దుస్థితి ఏర్పడినా అధికారులు మాత్రం వీటిని వినియోగంలోకి తీసుకురావడం లేదు.

కొత్తూరు మండలం గూనభద్ర ఎదురు ఆర్‌ఆర్‌ కాలనీలో ఆలయ నిర్మాణం ఇదిగో ఇలా మధ్యలో నిలిచిపోయింది. గార్లపాడు కాలనీలోనూ ఇదే పరిస్థితి. దేవతామూర్తుల విగ్రహాల్ని స్థానికంగా ఉన్న పాఠశాలల్లో ఉంచి పూజించుకోవాల్సిన దుస్థితి వారిది.

హిరమండలం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆర్‌ఆర్‌ కాలనీలో రహదారి దుస్థితి ఇది. ఈ మట్టి దారిలోనే అందరూ నడవాల్సి వస్తోంది. కాలనీ ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా కనీసం సీసీ రహదారి, డ్రైనేజీ లేవంటే నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అధికారులు ఏమేరకు శ్రద్ధ వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్ఛు పలు కాలనీల్లో ఇదే పరిస్థితి. ఉపాధిహామీ పథకంలో వేయించడానికి ఆస్కారం ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని