logo

ప్రయాణికుల సహనానికి పరీక్ష

విజయవాడలో వైకాపా జయహో బీసీ సభకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు తరలివెళ్లడంతో రెండో రోజు బుధవారం కూడా ప్రయాణికులు అవస్థలు తప్పలేదు.

Published : 08 Dec 2022 05:32 IST

టెక్కలిలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న విద్యార్థులు

విజయవాడలో వైకాపా జయహో బీసీ సభకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు తరలివెళ్లడంతో రెండో రోజు బుధవారం కూడా ప్రయాణికులు అవస్థలు తప్పలేదు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురంలోని ఆర్టీసీ కాంప్లెక్సు ఆవరణల్లో బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. మొత్తం నాలుగు డిపోల నుంచి బీసీ సభకు 77 బస్సులను పంపడంతో ఉన్నవి సరిపడక ప్లాట్‌ఫారాలు ఖాళీగా కనిపించాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఆసుపత్రులకు వెళ్లేవారి సహనానికి పరీక్ష ఎదురైంది. విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లేందుకు, వచ్చేందుకు నానా తంటాలు పడ్డారు. ఎంతకీ  బస్సులు రాకపోవడంతో అటుగా వెళ్లే వాహనాల్లో ప్రయాణాలు కొనసాగించారు.

- న్యూస్‌టుడే, అరసవల్లి, టెక్కలి పట్టణం

శ్రీకాకుళంలో విశాఖ నాన్‌స్టాప్‌ బస్సుల ఫ్లాట్‌ఫారం వద్ద ఇలా...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని