logo

ఆర్థిక ఇబ్బందులతో తాపీమేస్త్రీ బలవన్మరణం

కుటుంబ ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దలేక.. అప్పులు తీరే మార్గం కనిపించక తాపీ మేస్త్రీ బలవన్మరణానికి పాల్పడ్డారు.

Published : 26 May 2023 05:52 IST

పురుషోత్తం సాహు (పాత చిత్రం)

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: కుటుంబ ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దలేక.. అప్పులు తీరే మార్గం కనిపించక తాపీ మేస్త్రీ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇచ్ఛాపురం రైలు నిలయంలో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలను పలాస రైల్వే జీఆర్‌పీ ఎస్సై ఎస్‌కే షరీఫ్‌ గురువారం వెల్లడించారు. మృతుడు పట్టణ పరిధి రత్తకన్నలో తోట వీధికి చెందిన గుడియా పురుషోత్తం సాహు (43)గా గుర్తించారు. ఆయన తాపీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా మారడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహానికి పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో పంచనామా అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని షరీఫ్‌ చెప్పారు.


28.24 కిలోల గంజాయి పట్టివేత

జలుమూరు, న్యూస్‌టుడే: అక్రమంగా గంజాయి విక్రయాలు చేపడుతున్న ముఠా గుట్టు రట్టయింది. జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని దుర్గాప్రసాద్‌ దాస్‌, రాజకుమారి దాస్‌ ఇంటిపై గురువారం సిబ్బందితో దాడి చేసి 28.24 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు. ఒడిశా నుంచి వీరికి సరకు చేరుతుందని తెలిపారు. వీరితో పాటు పద్మావతి దాస్‌, దుబారిక రోహిత్‌, గొర్లె సాయిప్రకాశ్‌, పన్నీరు కుషీకుమార్‌, ఒడిశాకు చెందిన బృందావతి రౌలో మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసులో బృందావతి రౌలో మినహా ఆరుగురు నిందితులను గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచామన్నారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండు విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని