logo

నామినేషన్ల కోలాహలం

ప్రధాన పార్టీల అభ్యర్థులు శుక్రవారం టెక్కలి, పాతపట్నంలో నామినేషన్లు వేశారు. పాతపట్నంలో కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్‌ పత్రాలు దాఖలు కార్యక్రమానికి కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Published : 20 Apr 2024 04:56 IST

పాతపట్నంలో నామినేషన్‌ దాఖలు చేస్తున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు, పక్కన ఎంపీ రామ్మోహన్‌నాయుడు

టెక్కలి, పాతపట్నం, న్యూస్‌టుడే: ప్రధాన పార్టీల అభ్యర్థులు శుక్రవారం టెక్కలి, పాతపట్నంలో నామినేషన్లు వేశారు. పాతపట్నంలో కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్‌ పత్రాలు దాఖలు కార్యక్రమానికి కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా మామిడి గోవిందరావు నీలమణిదుర్గ ఆలయంలో పూజలు చేసి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఉన్నారు.

  • టెక్కలిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కిల్లి కృపారాణి,  వైకాపా అభ్యర్థిగా శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్‌ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.

టెక్కలిలో నామపత్రాలు అందిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కిల్లి కృపారాణి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని