logo

అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించాలి

ఎన్నికల ప్రచారం వేళ అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించాలని ఎస్‌ఈబీ డీసీ డి.శ్రీరామచంద్రమూర్తి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఎస్‌ఈబీ కార్యాలయంలో ఎస్‌ఈబీ ఏఎస్పీ డి.గంగాధరం అధ్యక్షతన సోమవారం ఎస్‌ఈబీ, ఎక్సైజ్‌ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు.

Published : 30 Apr 2024 05:26 IST

మాట్లాడుతున్న ఎస్‌ఈబీ డీసీ శ్రీరామచంద్రమూర్తి

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారం వేళ అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించాలని ఎస్‌ఈబీ డీసీ డి.శ్రీరామచంద్రమూర్తి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఎస్‌ఈబీ కార్యాలయంలో ఎస్‌ఈబీ ఏఎస్పీ డి.గంగాధరం అధ్యక్షతన సోమవారం ఎస్‌ఈబీ, ఎక్సైజ్‌ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బార్లు, ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఉమ్మడిగా దాడులు నిర్వహించాలని, సంబంధిత రికార్డులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఒడిశా రాష్ట్రంతో సరిహద్దు కలిగిన ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మెళియాపుట్టి, కొత్తూరు మండలాల్లోని పోలీస్‌స్టేషన్ల సిబ్బందితో దాడులు నిర్వహించి నాటుసారా, అక్రమ మద్యం రవాణాను అరికట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్‌ ఏసీ బి.శ్రీనివాసులు, ఎస్‌ఈబీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌.తిరుపతినాయుడు, ఏఈఎస్‌ టి.రాజశేఖర్‌, ఎస్‌ఈబీ సీఐలు ఎం.వి.గోపాలకృష్ణ, రాజారావు, సతీష్‌, కూర్మారావు పాల్గొన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని