logo

నిష్పక్షపాతంగా పని చేయండి

ఎన్నికల సిబ్బందిపై ఎంతో గురుతర బాధ్యత ఉందని, ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా పని చేయాలని వ్యయ పరిశీలకులు శరవణకుమార్‌, కోమల్‌ జీత్‌ మీనా, నవీన్‌కుమార్‌ సోనీ సూచించారు.

Published : 01 May 2024 06:32 IST

మాట్లాడుతున్న వ్యయ పరిశీలకుడు శరవణకుమార్‌, చిత్రంలో కోమల్‌ జీత్‌ మీనా, నవీన్‌కుమార్‌ సోనీ

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఎన్నికల సిబ్బందిపై ఎంతో గురుతర బాధ్యత ఉందని, ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా పని చేయాలని వ్యయ పరిశీలకులు శరవణకుమార్‌, కోమల్‌ జీత్‌ మీనా, నవీన్‌కుమార్‌ సోనీ సూచించారు. కలెక్టరేట్‌లో సమన్వయ కమిటీలు, నోడల్‌ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. పోటీలో ఉన్న అభ్యర్థుల రోజువారీ ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగదు, ఉచితాలు, మద్యం పంపిణీని నిరోధించేందుకు నిఘాను పటిష్ఠం చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీపీవో ప్రసన్న లక్ష్మి, ఆడిట్ అధికారి సుల్తానా, జీఎస్టీ సహాయ కమిషనర్‌ రాణిమోహన్‌, డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని