logo

భర్త పార్లమెంటుకు.. భార్య అసెంబ్లీకి పోటీ

చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులు ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పోలాకి మండలం యాట్ల బసివలస గ్రామానికి చెందిన కాయ దుర్గారావు, ఆయన భార్య కామేశ్వరి నరసన్నపేటలోని పెద్దపేట సమీపంలో చేపలు విక్రయిస్తుంటారు.

Updated : 01 May 2024 09:21 IST

ఎన్నికల బరిలో చేపల వ్యాపారి దంపతులు

దుర్గారావు, కామేశ్వరి

చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులు ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పోలాకి మండలం యాట్ల బసివలస గ్రామానికి చెందిన కాయ దుర్గారావు, ఆయన భార్య కామేశ్వరి నరసన్నపేటలోని పెద్దపేట సమీపంలో చేపలు విక్రయిస్తుంటారు. దాదాపు 10 కి.మీ. దూరం నుంచి నరసన్నపేటకు వచ్చి చేపలు అమ్ముకునే వీరికి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన వచ్చింది. ప్రస్తుతం వేట నిలిచిపోవడంతో వారి వ్యాపారానికి కూడా విరామం వచ్చింది. దీంతో నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానం నుంచి భర్త, నరసన్నపేట అసెంబ్లీ నుంచి భార్య పోటీకి దిగారు. పేదరికంలో ఉన్న తాము డీపట్టా భూముల సమస్యపై 2020 నుంచి తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయిందని, అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని దుర్గారావు వివరించారు.

న్యూస్‌టుడే, నరసన్నపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని