logo

గిరిబిడ్డలు గుర్తులేరా

కొత్తూరు మండలం కారిగూడ, అడ్డంగి, గొట్టిపల్లి, అల్తీ, తదితర పంచాయతీల్లో 1,600 మందిపైగా లబ్ధిదారులు ఉన్నారు. వీరి కొత్తూరు, కురిగాం, నివగాం గ్రామాల్లో బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్లాలంటే ఆయా గ్రామాల నుంచి ఆటోలు, బస్సులే దిక్కు.

Published : 01 May 2024 06:48 IST

కొండ దిగి.. కి.మీ.లు ప్రయాణిస్తేనే వారికి పింఛను
న్యూస్‌టుడే, మెళియాపుట్టి

రోడ్డు సదుపాయం లేక కాలినడకనే గ్రామానికి చేరుకుంటున్న కేరాసింగి వాసులు

  • కొత్తూరు మండలం కారిగూడ, అడ్డంగి, గొట్టిపల్లి, అల్తీ, తదితర పంచాయతీల్లో 1,600 మందిపైగా లబ్ధిదారులు ఉన్నారు. వీరి కొత్తూరు, కురిగాం, నివగాం గ్రామాల్లో బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్లాలంటే ఆయా గ్రామాల నుంచి ఆటోలు, బస్సులే దిక్కు.
  • రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో గిరిబిడ్డలకు కష్టాలు తప్పేలా లేవు. జిల్లాలో అత్యధిక గిరిజన జనాభా ఉన్న మెళియాపుట్టి, మందస, కొత్తూరు, పాతపట్నం, హిరమండలం, నందిగాం మండలాల్లోని పింఛనుదారుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లయింది. సరైన రవాణా సదుపాయం లేనివారంతా పింఛను నగదు అందుకోవాలంటే వ్యయప్రయాసలకు గురయ్యే పరిస్థితి కచ్చితంగా కనిపిస్తోంది.
  • మెళియాపుట్టి మండలం వెంకటాపురం, కేరాసింగి, భరణికోట, పరుశురాంపురం, బాణాపురం, ఇలైపురం, దీనబందపురం, తదితర గ్రామ సచివాలయాల పరిధిలో సుమారు 2,500 మందికిపైగా పింఛనుదారులు ఉన్నారు. వీరిలో పదనాపురం, బాణాపురం, బగడ, సుర్జిని, చీడిపాలెం, సజ్జనాపురం, నందవ, దబ్బగూడ గ్రామస్థులు జాడుపల్లి, భరణికోట, కొలిగాం, భావనాపురం, మాకనాపురం గ్రామస్థులు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి గొప్పిలిలోని బ్యాంకులకు చేరుకోవాలి.
  • పాతపట్నం మండలం బడ్డుమర్రి, గంగువాడ, ఎ.ఎస్‌ కవిటి సచివాలయాల పరిధిలో 1,300 మందికిపైగా పింఛను లబ్ధిదారులున్నారు. వీరిలో పెద్దమల్లిపురం, చిన్న మల్లిపురం గ్రామాల నుంచి 4 కిలోమీటర్లు, బడ్డుమర్రి పరిధిలోని పది గ్రామాల లబ్ధిదారులు 6 కిలోమీటర్లు ఆటోల్లో ప్రయాణించి గంగువాడ బ్యాంకుకు చేరుకోవాలి. ఎస్‌ఎస్‌మనుగు, ఏఎస్‌ కవిటి గ్రామాలవారు 8 కిలోమీటర్లు దూరంలోనిపర్లాఖెముండి(ఒడిశా) దాటి పాతపట్నం చేరుకోవాలి.
  • మందస మండలం పరిధి కొంకడాపుట్టి, సాబకోట, బొగాబంద, చీపి, బుడార్శింగి తల్ల గురండి, కొండలోగాం, తంగరపుట్టి గ్రామాల్లో 3 వేలకుపైగా లబ్ధిదారులు ఉన్నారు. వీరంతా పింఛను కోసం 10 కి.మీ. ప్రయాణించి మందస, సిరిపురం గ్రామాల్లోని బ్యాంకులకు వెళ్లాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని