logo

పీఎంకే అధ్యక్షుడిగా అన్బుమణి

పీఎంకే అధ్యక్షుడిగా అన్బుమణి రామదాస్‌ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. 25 ఏళ్లుగా ఆ పదవిలో ఉన్న జీకే మణికి ఇటీవల అభినందన సమావేశం జరిగింది. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు నిర్ణయించారు. యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్న అన్బుమణికి సీనియర్‌ నేతలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు.

Published : 29 May 2022 02:41 IST

ఏకగ్రీవంగా ఎన్నిక

సమావేశంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు

సైదాపేట, న్యూస్‌టుడే: పీఎంకే అధ్యక్షుడిగా అన్బుమణి రామదాస్‌ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. 25 ఏళ్లుగా ఆ పదవిలో ఉన్న జీకే మణికి ఇటీవల అభినందన సమావేశం జరిగింది. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు నిర్ణయించారు. యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్న అన్బుమణికి సీనియర్‌ నేతలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరువేర్కాడులోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. జీకే మణి నేతృత్వం వహించారు. పార్టీ వ్యవస్థాపకుడు రామదాస్‌, అన్బుమణి అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి వడివేలు రావణన్‌, కోశాధికారి తిలకభామ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి పీఎంకే రాష్ట్ర, జిల్లా, యూనియన్‌, నగర పంచాయతీల నిర్వాహకులు, పలు విభాగాలకు చెందిన ప్రతినిధులు పెద్దసంఖ్యలో వచ్చారు. మొదట అన్బుమణిని అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ తీర్మానం ఆమోదించారు. దీనికి సర్వసభ్య సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అన్బుమణిని అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే సమావేశంలో పాల్గొన్న అందరూ కరతాళ ధ్వనులతో సంతోషం వ్యక్తం చేశారు. మధ్య జిల్లా కార్యదర్శి కేఎన్‌ శేఖర్‌, అధ్యక్షుడు అనంత కృష్ణన్‌, నిర్వాహకులు అన్బుమణికి పూలమాల వేసి వెండి కత్తి బహూకరించారు. ముఖ్య నిర్వాహకులు అన్బుమణికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. 2026లో అన్బుమణి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని నినాదాలు చేశారు. అన్బుమణిని తండ్రి రామదాసు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. 25 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా ఉన్న జీకే మణి పార్టీ అసెంబ్లీ పక్ష నేతగా కొనసాగుతారని సమాచారం.

అన్బుమణికి రాజదండం అందిస్తున్న జీకే మణి

సీఎం శుభాకాంక్షలు

చెన్నై, న్యూస్‌టుడే: పీఎంకే కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అన్బుమణి రామదాస్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సామాజికన్యాయం మార్గంలో శ్రామికవర్గం అభివృద్ధి కోసం కృషిని కొనసాగించాలంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని