logo

గజవాహనంపై చంద్రశేఖరుడి వైభవం

అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహాదీపోత్సవాలు గత నెల 27వ తేదీన ప్రారంభమై వైభవంగా కొనసాగుతున్నాయి.

Published : 03 Dec 2022 00:31 IST

వెండి గజవాహనంపై ఊరేగుతున్న స్వామివారు

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహాదీపోత్సవాలు గత నెల 27వ తేదీన ప్రారంభమై వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులోభాగంగా శుక్రవారం ఉదయం గణపతిని మూషిక వాహనంపై ఊరేగించారు. తర్వాత ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని వెండి గజవాహనంపై కొలువుదీర్చారు. ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఆయన దర్శనభాగ్యం కల్పించారు. ఆ సమయంలో అరుణాచలేశ్వరస్వామిపై భక్తి చాటిన తిరుజ్ఞానసంబందర్‌, తిరునావుకరసర్‌, సుందరర్‌, మాణిక్యవాసగర్‌లనూ ఊరేగించారు. తర్వాత 63 నాయన్మారుల ఊరేగింపు కనులపండువగా సాగింది. సంతానం పొందిన దంపతులు చెరకు గడలకు ఊయల కట్టి పిల్లలను అందులో ఉంచి మాడ వీధుల్లో తిరుగుతూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

63 నాయన్మారుల ఊరేగింపు దృశ్యం

చెరకు గడ ఊయలలో సంతానాన్ని ఉంచి మొక్కు చెల్లిస్తున్న దృశ్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని