logo

ఐఐటీఎంలో సదస్సు

‘శాస్త్ర 2023’లో భాగంగా ఈ ఏడాది అంతరిక్ష సాంకేతిక సదస్సును ఐఐటీఎం నిర్వహిస్తోంది. దీనివల్ల పరిశోధకులతో పరిచయాలు బాగా పెరుగుతాయన్నారు. 

Updated : 26 Jan 2023 03:24 IST

ప్రసంగిస్తున్న వి.కామకోటి

వడపళని, న్యూస్‌టుడే: ‘శాస్త్ర 2023’లో భాగంగా ఈ ఏడాది అంతరిక్ష సాంకేతిక సదస్సును ఐఐటీఎం నిర్వహిస్తోంది. దీనివల్ల పరిశోధకులతో పరిచయాలు బాగా పెరుగుతాయన్నారు.  రెండు సంవత్సరాల విరామానంతరం 26 - 29వ తేదీ వరకు దేశంలోనే అతి పెద్ద ‘టెక్నికల్‌ ఫెస్టివల్‌’గా శాస్త్ర ఉండనుందని ఐఐటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇస్రోతో ఐఐటీ విద్యార్థులు దేశంలోని గెలాక్స్‌ ఐ స్పేస్‌, అగ్నికుల్‌ కాస్మోస్‌ వంటి సంస్థలతో కలిసి ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సులో భాగంగా మెషిన్‌ లెర్నింగ్‌, రోబోటిక్స్‌, ఆస్ట్రోనమీ, వెబ్‌ 3.0 వంటి సాంకేతిక అంశాలతోపాటు మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ వంటి వాటిపై కార్యశాలలు కూడా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటైన పాత్రికేయుల సమావేశంలో ఐఐటీ డైరెక్టర్‌ వి.కామకోటి మాట్లాడుతూ ఐఐటీ పరిశోధించిన 5జీ, హైపర్‌లూప్‌ వంటి సాంకేతికతలతో పాటు ఓపెన్‌ హౌజ్‌ కార్యశాలలు కూడా ఉంటాయన్నారు. రాకెట్‌, ఉపగ్రహ అభివృద్ధిపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారని పేర్కొన్నారు. స్టార్టప్‌లకు ఉపయోగకరంగా ఉండేందుకు భవిష్యత్తులో ఏ అవసరాలుంటాయో చర్చించనున్నారని అన్నారు. విద్యార్థి విభాగ డీన్‌ నిలేష్‌ జె.వాస, కోకరికులర్‌ అడ్వైజర్‌ రత్నకుమార్‌ అన్నాబత్తుల, కో కరికులర్‌ అఫైర్స్‌ కార్యదర్శి, బాయ్‌భాబి పట్నాయక్‌ తదితరులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని