logo

వాణీ జయరామ్‌కు కన్నీటి వీడ్కోలు

చెన్నైలో కన్నుమూసిన గాయని వాణీ జయరామ్‌ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.

Published : 06 Feb 2023 00:49 IST

గాయని వాణీ జయరామ్‌ భౌతికకాయానికి ప్రభుత్వలాంఛనాలతో అంత్యక్రియలు

చెన్నైలో కన్నుమూసిన గాయని వాణీ జయరామ్‌ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఇంట్లో మంచం నుంచి జారిపడి వాణీ జయరామ్‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె భౌతిక కాయానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అంజలి ఘటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిత్రపరిశ్రమ వాణీ జయరామ్‌ కన్నుమూతతో దిగ్భ్రాంతికి గురైందని తెలిపారు. 19 భాషల్లో 10 వేలకు పైగా పాటలు పాడి ఆమె చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. వాణీ జయరామ్‌ స్వర ప్రస్థానాన్ని కీర్తిస్తూ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

నివాళులర్పించేందుకు వస్తున్న సీఎం స్టాలిన్‌, మంత్రి మా.సుబ్రమణియన్‌

న్యూస్‌టుడే, కోడంబాక్కం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని