logo

కాంగ్రెస్‌ గూటికి మన్సూర్‌ అలిఖాన్‌

సినీ నటుడు మన్సూర్‌ అలిఖాన్‌ కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు.

Published : 26 Apr 2024 01:06 IST

సెల్వపెరుంతగైకు లేఖ అందిస్తున్న మన్సూర్‌ అలిఖాన్‌

చెన్నై, న్యూస్‌టుడే: సినీ నటుడు మన్సూర్‌ అలిఖాన్‌ కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. నగరంలోని సత్యమూర్తి భవన్‌లో గురువారం టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగైను ఆయన కలిశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు సుముఖత తెలుపుతూ లేఖ అందించారు. అందులో.. మొదట తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, మళ్లీ మాతృపార్టీలో చేరనున్నానని తెలిపారు. తన జననాయగ పులిగళ్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్టు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని