logo

ఇంగ నాన్‌తాన్‌ కింగు ట్రైలర్‌ విడుదల

ఆనంద్‌ నారాయణన్‌ దర్శకత్వంలో సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్‌తాన్‌ కింగు’. ప్రియాలయ, మనోబాలా, తంబి రామయ్య, మునీశ్‌కాంత్‌, బాల శరవణన్‌ తదితరులు ఇతర తారాగణం.

Published : 28 Apr 2024 00:48 IST

ట్రైలర్‌లో ఓ సన్నివేశం

చెన్నై, న్యూస్‌టుడే: ఆనంద్‌ నారాయణన్‌ దర్శకత్వంలో సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్‌తాన్‌ కింగు’. ప్రియాలయ, మనోబాలా, తంబి రామయ్య, మునీశ్‌కాంత్‌, బాల శరవణన్‌ తదితరులు ఇతర తారాగణం. చిత్రాన్ని గోపురం ఫిలిమ్స్‌ పతాకంపై అన్బు చెళియన్‌, సుశ్మితా అన్బు చెళియన్‌ సంయుక్తంగా నిర్మించారు. చిత్రం ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చిత్రం మే 10న విడుదల కానుంది.


స్టార్‌ ట్రైలర్‌...

ట్రైలర్‌లో ఓ దృశ్యం

చెన్నై: ఇళన్‌ దర్శకత్వంలో కవిన్‌ నటించిన చిత్రం ‘స్టార్‌’. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు. లాల్‌, గీతా కైలాసం, ప్రీతి ముకుందన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిత్రం మే 10న విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. వర్థమాన నటుడు పడే కష్టాలు, ఎదుర్కొనే అవమానాలను ట్రైలర్‌లో చూపించారు.


 కురంగు పెడల్‌ పాట...

సినిమా పోస్టరు

చెన్నై: కమలకన్నన్‌ దర్శకత్వంలో నటుడు శివకార్తికేయన్‌కు చెందిన ఎస్కే ప్రొడక్షన్‌ నిర్మించిన చిత్రం ‘కురంగు పెడల్‌’. కాళి వెంకట్‌ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం మే 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని ‘కొణ్‌డాట్టం’ పాట వీడియోను యూట్యూబ్‌లో చిత్ర బృందం విడుదల చేసింది.


రాబర్‌ ఫస్ట్‌లుక్‌...

ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తున్న శివకార్తికేయన్‌

చెన్నై: నగరంలో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా దర్శకుడు ఎస్‌.ఎం.పాండి తెరకెక్కించిన చిత్రం ‘రాబర్‌’. దర్శకుడు ఆనంద కృష్ణన్‌ స్వీయ రచనలో ఈ చిత్రం రూపొందింది. చిత్రీకరణ చెన్నైలోని త్యాగరాయనగర్‌, వేళచ్చేరి, నగర పరిసరాల్లోని సెమ్మంజేరి, ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డు, ఓల్డ్‌ మహాబలిపురం వంటి ప్రాంతాల్లో జరిగింది. సత్య హీరోగా నటించగా దీపా శంకర్‌, జయప్రకాశ్‌, సెన్‌రాయన్‌, డేని పోప్‌ తదితరులు ఇతర నటీనటులు. చిత్రం టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ను నటుడు శివకార్తికేయన్‌ విడుదల చేశారు. మే నెలాఖరులోపు చిత్రం విడుదల కానున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని