logo

అంధ పాఠకులకు ప్రత్యేక యాప్‌

సభ్యత్వం ఉన్న వారికి పుస్తకాలను అద్దెకిచ్చే పద్ధతిని ఇటీవల అన్నా సెంటినరీ గ్రంథాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే.

Published : 07 May 2024 00:14 IST

అన్నా సెంటినరీ గ్రంథాలయం ఏర్పాటు
న్యూస్‌టుడే, వడపళని

గ్రంథాలయంలోని రికార్డింగ్‌ స్టూడియో

సభ్యత్వం ఉన్న వారికి పుస్తకాలను అద్దెకిచ్చే పద్ధతిని ఇటీవల అన్నా సెంటినరీ గ్రంథాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి మంచి ఆదరణ కనిపిస్తోంది. తాజాగా గ్రంథాలయం అంధుల కోసం ‘డీఏఐఎస్‌వై’, ‘ఈపీయూబీ’ లిపి, ఆడియో విధానంతో వారికి అర్థమయ్యేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ముందుగా 100 పుస్తకాలు

గ్రంథాలయం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న కొత్త యాప్‌లో 100 పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకరాలు డీఏఐఎస్‌వై, ఈపీయూబీ, ఆడియో ఫార్మేట్లో ఉండనున్నాయి. గ్రంథాలయంలో రికార్డింగు కోసం ఏడాది క్రితమే స్టూడియోను కూడా సిద్ధం చేసింది. గ్రంథాలయంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే యాప్‌ వెసులుబాటు కలగనుంది. అంధులు, దివ్యాంగులు నేషనల్‌ ఐడీ కార్డు చూపించి పేర్లు నమోదు చేసుకుని సేవలు వినియోగించుకునే వీలుంటుందని గ్రంథాలయ అధికారులు పేర్కొన్నారు.

ఆర్బిట్ రీడర్‌తో సేవలు

ఆర్బిట్ రీడర్‌ అనే పరికరం ద్వారా బ్రెయిలీ లిపిలో మార్చే వీలుంటుంది. అంధులు జనరల్‌ ఫార్మేట్ లేదా డీఏఐఎస్‌వై ఫార్మేట్ ద్వారా యాప్‌ సేవలు పొందే వీలుంటుంది. బ్రెయిలీ లిపి అవసరమున్న వారికి ‘నాన్‌ విజువల్‌ డెస్క్‌టాప్‌ యాక్సెస్‌’ (ఎన్‌వీడీఏ) విధానంతో చూసే వీలుంటుంది. ఆడియో డేటాలు (2 టీబీ వాల్యూమ్‌తో కూడినవి) గ్రంథాలయ సభ్యులకు వీక్షించే వీలుందని, అన్ని రకాల వాటిని అంధులకు ఉచితంగానే అందివ్వనున్నట్టు గ్రంథాలయం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని