logo
Published : 28/11/2021 04:03 IST

మా నాయకులు చెప్పినా తప్పుచేయొద్దు

వాలంటీర్లకు ఎమ్మెల్యే హితవు

ట్రాక్టర్‌పై ఎమ్మెల్యే రమణమూర్తిరాజు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: గ్రామస్థాయిలో అధికార పార్టీ నాయకులు చెప్పినా తప్పు చేయొద్దని ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం 40 మంది వాలంటీర్లకు నియామక పత్రాలను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో వైకాపా నాయకులు వారి బంధువులను, ఇంట్లో వారిని వాలంటీర్లగా నియమించారని, దీని వల్ల వారు పనిచేయడం లేదని తెలిపారు. నాయకులు కుటుంబాలకు చెందిన వారినే వాలంటీర్లగా నియమించుకుంటే 50 కుటుంబాలకు అన్యాయం చేసిన వారమవుతామని మందలించారు. వాలంటీర్లగా పనిచేస్తూ మరో దగ్గర ఉద్యోగాలు చేసే వారిని వెంటనే తొలగించాలన్నారు. 90 శాతం మంది మహిళలనే నియమించాలన్నారు. మెరుగైన పాలన అందివ్వడానికి వైకాపా ప్రభుత్వం ఎంతో ఆర్థికభారమైనా వాలంటీర్లను కొనసాగిస్తున్నారన్నారు. పథకాలు అందివ్వడంలో అర్హులా కాదా అనే విషయం ఒక్కటే చూడాలన్నారు. ఎవరికీ భయపడకుండా వాలంటీర్లు పనిచేయాలని, ఎవరికైనా ఇబ్బంది వస్తే తనకు తెలియజేయాలన్నారు. ఎంపీడీఓ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు నర్మాల కుమార్‌, లాలం రాంబాబు, మాజీ ఎంపీపీ వడిశెల శ్రీనివాసరావు, నాయకులు కోన బుజ్జి, దేశంశెట్టి శంకరరావు, చేపల శ్రీరాములు, కూండ్రపు వెంకునాయుడు, ద్వారపురెడ్డి బాబ్జీ, ధర్మిరెడ్డి నాయుడుబాబు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి ముందుకురావాలి
అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పరిసర గ్రామాల అభివృద్ధికి సెజ్‌లోని పరిశ్రమలు ముందుకురావాలని ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ.రమణమూర్తిరాజు(కన్నబాబు) కోరారు. మోసయ్యపేట   పంచాయతీకి ల్యారస్‌ ల్యాబ్స్‌ కంపెనీ అందించిన ట్రాక్టర్‌ను శనివారం ఎమ్మెల్యే పంచాయతీ సర్పంచి పైడిరాజుకు అందించారు. వైకాపా నాయకులు దేశంశెట్టి శంకరరావు, కోన బుజ్జి, కొమ్మోజు ఈశ్వరరావు, కంపెనీ ప్రతినిధి మోహర్‌, ఎంపీడీఓ కృష్ణ, ఈవోఆర్డీ లోవరాజు, ఎంపీటీసీ సభ్యులు లాలం శ్రీను పాల్గొన్నారు.

 

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని