logo
Published : 28/11/2021 04:03 IST

పర్యాటకశాఖ పంచారామాల యాత్ర ప్రారంభం

మొదటి సర్వీసు వద్ద ప్రయాణికులు, పర్యాటకశాఖ అధికారులు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని శివక్షేత్రాలైన పంచారామాల యాత్రను పర్యాటకశాఖ ప్రారంభించింది. మొదటి సర్వీసును శనివారం సాయంత్రం అప్పుఘర్‌ దరి పర్యాటకశాఖ హరిత రిసార్ట్స్‌ వద్ద డి.ఎం. బాపూజీ, సెంట్రల్‌ రిజర్వేషన్‌ మేనేజర్‌ కృష్ణమోహన్‌ ప్రారంభించారు. డి.ఎం. బాపూజీ మాట్లాడుతూ విశాఖ నుంచి రాత్రి సమయంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం అమరావతి, తర్వాత భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట తదితర క్షేత్రాలను సందర్శించి తిరిగి విశాఖకు తీసుకువస్తామన్నారు. పెద్దలకు రూ.1685, పిల్లలకు రూ.1350 చొప్పున వసూలు చేస్తున్నామన్నారు. సమాచారం కోసం 98488 13584, 98480 23948, 88974 64333 ఫోన్‌నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని