logo

ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులపై కేసులు నమోదు

సంక్రాంతి నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్న 20 ప్రైవేటు ట్రావెల్‌ బస్సులపై రవాణాశాఖ అధికారులు శుక్రవారం కేసులు నమోదు చేశామని డీటీసీ జి.సి.రాజారత్నం తెలిపారు.

Published : 15 Jan 2022 05:29 IST

ట్రావెల్‌ బస్సు పత్రాలను పరిశీలిస్తున్న రవాణాశాఖ అధికారులు

మాధవధార, న్యూస్‌టుడే: సంక్రాంతి నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్న 20 ప్రైవేటు ట్రావెల్‌ బస్సులపై రవాణాశాఖ అధికారులు శుక్రవారం కేసులు నమోదు చేశామని డీటీసీ జి.సి.రాజారత్నం తెలిపారు. వీరి నుంచి రూ.45 వేలు అపరాధ రుసుం వసూలు చేశామన్నారు. ముఖ్యంగా ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడం, పత్రాలు సక్రమంగా లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా వస్తువుల రవాణా చేయడంపై తనిఖీలు చేపడుతున్నామన్నారు. పండగ ముగిసినంత వరకు నిరంతరం ఈ తనిఖీలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని