logo

శత్రువులు డ్రోన్‌ దాడి చేస్తే..

శత్రువులు డ్రోన్‌ద్వారా దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలో సాధన చేసేలా ఉక్కు సీఐఎస్‌ఎఫ్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో సోమవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. శత్రు డ్రోన్‌ ప్రవేశాన్ని వాచ్‌ టవర్స్‌లో కాపలా ఉంటున్న జవాన్లు గుర్తించి తగిన విధంగా ప్లాన్‌ చేసి

Published : 18 Jan 2022 05:58 IST

మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్న ఉక్కు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది

ఉక్కునగరం(గాజువాక)న్యూస్‌టుడే: శత్రువులు డ్రోన్‌ద్వారా దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలో సాధన చేసేలా ఉక్కు సీఐఎస్‌ఎఫ్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో సోమవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. శత్రు డ్రోన్‌ ప్రవేశాన్ని వాచ్‌ టవర్స్‌లో కాపలా ఉంటున్న జవాన్లు గుర్తించి తగిన విధంగా ప్లాన్‌ చేసి తిప్పి కొట్టేందుకు సిద్ధం కావాలంటూ వ్యూహరచన చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఊహించని వాటిని ఆశించకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాక్‌ డ్రిల్‌లో సీఐఎస్‌ఎఫ్‌, కోస్ట్‌ గార్డ్‌, స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఉక్కు యాజమాన్యం కలసి సంయుక్తంగా ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని