logo

మరో.. 1,959 కేసులు నమోదు

కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ పాజిటివిటీ రేటు 39.91తో 1959 కేసులు నమోదయ్యాయి.

Published : 23 Jan 2022 04:54 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ పాజిటివిటీ రేటు 39.91తో 1959 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు బాధితులు మృతి చెందారు. మృతుల్లో అత్యధికులు 70 ఏళ్లు దాటిన వారున్నారు. గుండె, కాలేయం, మూత్రపిండాలు, మధుమేహం, రక్తపోటు వంటి ఇతర రుగ్మతలతో బాధపడుతూ కొవిడ్‌ బారిన పడి మృతి చెందిన వారే అధికంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఒడిశా నుంచి హిమీఫీలియోతో బాధపడుతూ వచ్చిన 11 నెలల చిన్నారి కొవిడ్‌తో కన్నుమూసిన వారిలో ఉన్నారు. మరో వైపు కోలుకుంటున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 684 మంది కోలుకున్నారు. 250 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జిల్లాలో మొత్తం బాధితులు: 1,75,853

శనివారం కోలుకున్న వారు: 684

మొత్తం కోలుకున్న వారు: 1,60,435

మొత్తం మృతులు: 1,126

చికిత్స పొందుతున్న వారు: 14,292

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని