logo

సంక్షిప్త వార్తలు

తుని రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రేగుపాలెం - నర్సీపట్నం రోడ్డు స్టేషన్ల మధ్య రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు (65) మృతి చెందిందని జీఆర్పీ ఎస్సై అబ్దుల్‌ మారూఫ్‌ ఆదివారం తెలిపారు. ఈమె ఎవరనేది వివరాలు తెలియరాలేదని,

Published : 24 Jan 2022 01:38 IST

రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలి మృతి

తుని పట్టణం, న్యూస్‌టుడే: తుని రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రేగుపాలెం - నర్సీపట్నం రోడ్డు స్టేషన్ల మధ్య రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు (65) మృతి చెందిందని జీఆర్పీ ఎస్సై అబ్దుల్‌ మారూఫ్‌ ఆదివారం తెలిపారు. ఈమె ఎవరనేది వివరాలు తెలియరాలేదని, మరింత సమాచారం కోసం రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.


తీర్థంలో నృత్యాలు.. ఇద్దరి అరెస్టు

మాకవరపాలెం: జి.వెంకటాపురం శివారు సుభద్రయ్యపాలెం గ్రామ తీర్థం సందర్భంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన స్టేజి నృత్యాలపై పోలీసులు దాడి చేశారు. మహిళలతో డ్యాన్సు చేయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణరావు పేర్కొన్నారు. జి.గంగవరం తీర్థం సందర్భంగా గ్రామ శివారు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కోడిపందేల శిబిరాలపై దాడి చేసి ఆరుగుర్ని అరెస్టు చేశామన్నారు.


గోవా మద్యంతో నలుగురు..

పాయకరావుపేట, న్యూస్‌టుడే: అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగుర్ని పేట పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై తాండవ కూడలిలో వాహన తనిఖీలు చేపట్టగా.. కారులో వస్తున్న వ్యక్తులు పారిపోయేందుకు యత్నించారు. వారిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కారులో గోవా నుంచి తీసుకువస్తున్న ఏడు మద్యం సీసాలు, చెర్రస్‌ (గంజాయితో చేసిన నల్లముద్ద)ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు విశాఖకు చెందిన రాజమనోహర్‌, అణికుమార్‌, షణ్ముక్‌సూర్యఅఖిల్‌, ప్రకాష్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు.


కారు ఢీకొని వ్యాపారికి తీవ్రగాయాలు

పాడేరు, న్యూస్‌టుడే: మోదకొండమ్మ గుడి ఎదురుగా ఆదివారం ఉదయం కాలినడకన వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఓ పర్యాటకుడి కారు నడిచి వెళుతున్న స్థానిక నూడిల్స్‌ వ్యాపారి దిలీప్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కేజీహెచ్‌కు తరలించారు.


విద్యార్థిని అదృశ్యంపై కేసు

కొయ్యూరు: కొత్తబంగారమ్మపేట గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని ఎస్సై నాగేంద్ర తెలిపారు. శనివారం పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని