logo

పేదలను ముంచేస్తారా..

భారీ వర్షానికి గెడ్డలు పొంగి ధ్వంసమైన సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం జగనన్నకాలనీ లేఅవుట్‌ను మంగళవారం తెదేపా నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం గెడ్డలు,

Updated : 29 Jun 2022 04:59 IST

మాజీ మంత్రి బండారు
ధ్వంసమైన పైడివాడ అగ్రహారం లేఅవుట్‌ పరిశీలన
న్యూస్‌టుడే, సబ్బవరం

నామరూపాల్లేని లేఅవుట్‌

భారీ వర్షానికి గెడ్డలు పొంగి ధ్వంసమైన సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం జగనన్నకాలనీ లేఅవుట్‌ను మంగళవారం తెదేపా నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం గెడ్డలు, వాగులు, చెరువుల్లో పేదలకు పట్టాలిచ్చి వారిని ప్రమాదంలోకి నెట్టేసిందని దుయ్యబట్టారు. గెడ్డల ప్రవాహానికి కట్టిన ఇళ్లు కూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. వైకాపా నేతలు ఇక్కడి కొండలను తవ్వి గ్రావెల్‌ సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. మొదట్లో ఈ కొండపై వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మిస్తామని గ్రామ ప్రజలకు చెప్పారన్నారు. లేఅవుట్‌ వేసిన తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేసి మోసం చేశారన్నారు.
‌ లేఅవుట్‌ స్థలాన్ని చదును చేయడానికి ఉపాధి హామీ పథకం నిధులు ఉపయోగించారన్నారు. ఎంత నిధులు ఖర్చు చేసింది బహిర్గతం చేయలేదన్నారు. ఈ లేఅవుట్లో గెడ్డల స్థలాలకు వైకాపా కార్యకర్తల పేర్లు రాసి ల్యాండ్‌ పూలింగ్‌ కింద స్థలాలు కేటాయించారని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మోసాలను వెలికి తీస్తామన్నారు. అనర్హులను తొలగించి గెడ్డలు ప్రవాహానికి ఇబ్బంది లేకుండా లేఅవుట్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తామన్నారు. సబ్బవరం మండల తెదేపా అధ్యక్షుడు మిడతాడ మహలక్ష్మినాయుడు, నేతలు పాల్గొన్నారు.

లేఅవుట్‌ వద్ద పరిశీలిస్తున్న బండారు, స్థానికులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని