logo

పోలీసు పహారాలో రైల్వేస్టేషన్లు

ఆర్‌ఆర్‌బీ ఫలితాల్లో జాప్యాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పరీక్షా అభ్యర్థులు రైల్‌రోకోకు పిలుపు ఇవ్వడంతో అనకాపల్లి, ఎలమంచిలి రైల్వేస్టేషన్లలో ఆదివారం భారీ పోలీసు బందోబస్తు చేపట్టారు.

Published : 03 Oct 2022 03:32 IST

అనకాపల్లి స్టేషన్‌లో బందోబస్తును పరిశీలిస్తున్న ఏఎస్పీ విజయభాస్కర్‌, డీఎస్పీ సునీల్‌, ఆర్పీఎఫ్‌ సీఐ

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఆర్‌ఆర్‌బీ ఫలితాల్లో జాప్యాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పరీక్షా అభ్యర్థులు రైల్‌రోకోకు పిలుపు ఇవ్వడంతో అనకాపల్లి, ఎలమంచిలి రైల్వేస్టేషన్లలో ఆదివారం భారీ పోలీసు బందోబస్తు చేపట్టారు. అనకాపల్లిలో అదనపు ఎస్పీ విజయ భాస్కర్‌, ఎలమంచిలిలో పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారాల వద్ద ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ, పట్టణ పోలీసులు కాపలా ఉన్నారు. ఆందోళనకారులు స్టేషన్‌లోకి ప్రవేశించకుండా అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ విజయభాస్కర్‌ ఆదేశాలిచ్చారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అదుపులోకి తీసుకొని తనిఖీలు చేపట్టాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసి లోపలకు అనుమతి ఇచ్చారు. అనకాపల్లి, ఎలమంచిలి సీఐ,ఎస్‌ఐలు మధు, గఫూర్‌, రామకృష్ణ, అమన్నరావు, ఆర్‌పీఎఫ్‌ సీఐ మధు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని