logo

మేమొస్తే.. మీ పేర్లు కనిపించవు

వైద్య విశ్వవిద్యాలయానికి వైఎస్‌ రాజశేఖరెడ్డి పేరు తొలగించకపోతే, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ (వైఎస్‌, జగన్‌) పేర్లు కనిపించవు, వినిపించవని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Updated : 04 Oct 2022 05:09 IST

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత


ప్రసంగిస్తున్న అనిత

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: వైద్య విశ్వవిద్యాలయానికి వైఎస్‌ రాజశేఖరెడ్డి పేరు తొలగించకపోతే, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ (వైఎస్‌, జగన్‌) పేర్లు కనిపించవు, వినిపించవని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పును నిరసిస్తూ ఎస్‌.రాయవరంలో తెదేపా నాయకులు సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావుతో కలిసి అనిత మహాకవి గురజాడ అప్పారావు కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారంతా గర్వంగా తలెత్తుకునేలా చేసిన వ్యక్తి అని, విశ్వవిద్యాలయానికి పేరు మార్పు కుట్రతోనే చేశారన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రజల దృష్టి మళ్లించేందుకు విశ్వవిద్యాలయం పేరు మార్చారన్నారు. కొత్త ప్రాజెక్టులు, భవనాలు, కొత్త పథకాలకు వైఎస్‌ పేరు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారు. ముఖ్యమంత్రి జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబుకు మధ్య ప్రతిభ, నాయకత్వం, అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రి రోజాకు సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌లో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ ఇంటికి నోటీసు ఇచ్చేందుకు వెళ్లిన సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వ మూడేళ్ల పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదన్నారు. నాయకులు అమలకంటి అబద్ధం, జానకి శ్రీను, కొప్పిశెట్టి వెంకటేష్‌, పెదిరెడ్డి చిట్టిబాబు, కురందాసు నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని