logo

బాలిక హత్య కేసులో ఇద్దరికి 20ఏళ్ల జైలుశిక్ష

గొలుగొండ మండలం అప్పనపాలెం దరి జీడితోటలో బాలిక సూరాడ దివ్యశ్రీ 2015 ఆగస్టు 5న హత్యకు గురైంది.

Published : 07 Dec 2022 03:05 IST

గొలుగొండ, న్యూస్‌టుడే: గొలుగొండ మండలం అప్పనపాలెం దరి జీడితోటలో బాలిక సూరాడ దివ్యశ్రీ 2015 ఆగస్టు 5న హత్యకు గురైంది. అప్పటి సీఐ గపూర్‌, ఎస్సై జోగరావు విచారణ చేపట్టారు. కోటవురట్ల మండలం లింగాపురానికి చెందిన కోన మహేష్‌, గొలుగొండ మండలం కొత్తఎల్లవరానికి చెందిన వనగల నానాజీని నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. అప్పటి కేసులో నేరం రుజువు కావడంతో పైన పేర్కొన్న నేరస్థులకు విశాఖపట్నం పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.రామ శ్రీనివాసరావు 20 ఏళ్ల జైలుశిక్ష, రూ. 25 వేల జరిమానా విధించినట్లు ప్రస్తుత ఎస్సై నారాయణరావు విలేకరులకు తెలిపారు. జరిమానా చెల్లించకుంటే మరో 18 నెలల శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. పీపీ కరణం కృష్ణ బాధిత కుటుంబం తరఫున వాదనలు వినిపించినట్లు ఎస్సై వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని