logo

గ్రీన్‌బెల్ట్‌ గోవిందా...

విశాఖ నగరంలో మద్దిలపాలెం నుంచి ఎన్యేడీ కూడలి వరకూ ఉన్న గ్రీన్‌బెల్ట్‌ అధ్వానస్థితికి చేరింది. జీవీఎంసీ యంత్రాంగం వదిలేయడంతో ఎవరి ఇష్టానుసారంగా వారు వాడేసుకుంటున్నారు.

Published : 01 Feb 2023 05:34 IST

ఈనాడు, విశాఖపట్నం

తాటిచెట్లపాలెం ప్రాంతంలో చెట్లను నరికేసిన దృశ్యం

విశాఖ నగరంలో మద్దిలపాలెం నుంచి ఎన్యేడీ కూడలి వరకూ ఉన్న గ్రీన్‌బెల్ట్‌ అధ్వానస్థితికి చేరింది. జీవీఎంసీ యంత్రాంగం వదిలేయడంతో ఎవరి ఇష్టానుసారంగా వారు వాడేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెట్లను కొట్టేస్తున్నారు. ఇనుప కంచెను విరగ్గొట్టేశారు. చెత్తాచెదారం వేసేస్తున్నారు. వాహనాల్ని నిలిపేందుకు అనువుగా చదును చేస్తున్నారు. ఏఎస్సార్‌ నగర్‌ వాసులకు టిడ్కో ఇళ్లు ఇవ్వకపోవడంతో గ్రీన్‌బెల్ట్‌లోనే ఆవాసాలు ఏర్పరచుకొని కాపురాలు ఉంటున్నారు. పశువుల్ని కట్టేస్తున్నారు.. రాత్రి, పగలు తేడా లేకుండా మందుబాబులు అడ్డాగా మార్చేసుకున్నారు. ఈ చర్యలన్నిటి వల్లా పచ్చదనానికి పెనుముప్పు వాటిల్లింది. అవే ఈ దృశ్యాలు.

అక్కయ్యపాలెంలో మోడువారిన చెట్లు

అల్లూరి సీతారామరాజు నగర్‌లో మట్టిదిబ్బలు

ఎక్కడ చూసినా ఇదే దుస్థితి

ఎన్‌ఏడీ సమీపంలో పశువులకు ఆవాసం

ఎన్‌.ఎస్‌.టి.ఎల్‌. వద్ద గోతులమయం

కంచరపాలెం ఏరియా గ్రీన్‌బెల్ట్‌లో పేదల గూళ్లు

ఆర్‌అండ్‌బి: దారిపొడవునా కార్ల పార్కింగే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని