రెచ్చిపోయిన కిరాయి మూక
ఆనందపురం మండలం నారాయణగజపతిరాజు రెవెన్యూ పరిధిలో ఓ భూ తగాదా నేపథ్యంలో రంగంలోకి దిగిన కిరాయి మూక ఆదివారం అర్ధరాత్రి శొంఠ్యాంలో బీభత్సం సృష్టించింది.
శొంఠ్యాంలో అర్ధరాత్రి దాడి
దాడి చేసేందుకు గుంపుగా వచ్చిన దృశ్యం
ఆనందపురం, న్యూస్‌టుడే: ఆనందపురం మండలం నారాయణగజపతిరాజు రెవెన్యూ పరిధిలో ఓ భూ తగాదా నేపథ్యంలో రంగంలోకి దిగిన కిరాయి మూక ఆదివారం అర్ధరాత్రి శొంఠ్యాంలో బీభత్సం సృష్టించింది. వద్దని వేడుకుంటున్నా...కాపాడాలని ప్రాథేయపడినా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలివి. శొంఠ్యాం పంచాయతీ ప్రసాదరావు పాలెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు స్థానిక పెట్రోల్ బంకు సమీప స్థలంలో కొద్ది రోజులుగా ఉంటున్నారు. ఇది తమ భూమి అని, దీనికి సంబంధించి కోర్డులో కేసు ఉందంటూ అక్కడే రేయింబవళ్లు ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రసాద కన్నమ్మ(60), ప్రసాద రాము(31), ప్రసాద నాయుడు, సారిపల్లి అప్పలరాజు, సారిపల్లి నూకాలమ్మ కుటుంబీకులు ఆదివారం వివాదాస్పద భూమిలో నిద్రించారు. అర్ధరాత్రి వేళ పెద్ద సంఖ్యలో వచ్చిన కిరాయి మూకలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రసాద రాము(31), ప్రసాద కన్నమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. కిరాయి మూక వెళ్లిపోయాక 108 వాహనంలో గాయపడిన ఇద్దరినీ కేజీహెచ్‌లో చేర్పించారు. * జరిగిన ఘటనపై ఆనందపురం పోలీసులకు సోమవారం ప్రసాద నాయుడు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ నర్సింహమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి వివరాలు సేకరించారు. రాత్రి వేళ కావడం, కిరాయి మూకలోని వ్యక్తులు స్థానికులు కాకపోవడంతో ఎవరినీ పోల్చుకోలేని పరిస్థితి నెలకొందని బాధితులు పేర్కొన్నారు. బంకుకు సంబంధించిన మనుషులు కొందరు ఈ మూకతో ఉన్నారని విలేకరులతో ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు. బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ప్రసాద రాము సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట: పాకిస్థాన్‌లో 11 మంది మృత్యువాత
-
India News
20 రూపాయలకే మినీ హోటల్లో గది
-
Politics News
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు... న్యాయపరంగానే పోరాడతా
-
Ts-top-news News
టోల్ రూపంలో 9 ఏళ్లలో రూ.9 వేల కోట్ల వసూలు
-
Sports News
ధోనీకి కెప్టెన్‌గా కొంచెం కష్టపడ్డా: స్టీవ్ స్మిత్
-
World News
No Smoking: ఆఫీసులో 4500 సార్లు స్మోకింగ్ బ్రేక్.. అధికారికి రూ.8.8లక్షల జరిమానా