వినికిడి యంత్రాల ఉపకరణాలు ఉచితంగా సరఫరా చేయాలి
వినికిడి లోపాలను సరిదిద్దేందుకు గతంలో పలువురు చిన్నారులకు కాక్లియర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లు చేశారని, ఆ సమయంలో ఇచ్చిన వినికిడి యంత్రాలు పనిచేయనపుడు వాటిని సరిదిద్దే యంత్రాంగం...
బాధిత చిన్నారుల తల్లిదండ్రుల వినతి
కలెక్టరేట్‌కు వచ్చిన వినికిడి లోపాలున్న బాలబాలికలు, వారి తల్లిదండ్రులు
వన్‌టౌన్, న్యూస్‌టుడే: వినికిడి లోపాలను సరిదిద్దేందుకు గతంలో పలువురు చిన్నారులకు కాక్లియర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లు చేశారని, ఆ సమయంలో ఇచ్చిన వినికిడి యంత్రాలు పనిచేయనపుడు వాటిని సరిదిద్దే యంత్రాంగం ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకపోవడం వల్ల నానా అవస్థలు పడుతున్నామని మూగ, చెవిటి బాధిత పిల్లల తల్లిదండ్రులు వాపోయారు. రాష్ట్రంలోని ఉత్తరాంధ్రతోపాటు పలు జిల్లాల నుంచి వినికిడి లోపాలతో బాధపడే పలువురు చిన్నారులతో కలిసి తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. గత నెలలో తాము విశాఖకు వచ్చి వినతిపత్రం అందజేశామని, కలెక్టర్ సూచన మేరకు ఈఎన్టీ ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారిని కలిశామన్నారు. వినికిడి యంత్రాలను అమర్చడం వరకే తమ బాధ్యతని, అవి పనిచేయనపుడు సరిదిద్దే సాంకేతిక వ్యవస్థ తమ వద్ద లేదని తెలపడంతో మరోసారి కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చామని వాపోయారు. తామంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నామని, తమ పిల్లలకు పుట్టుకతో మూగ, చెవిటి ఉందని, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఖరీదైన శస్త్రచికిత్సలు చేయించిందని తెలిపారు. ప్రస్తుతం సంబంధిత యంత్రాలు పనిచేయడం లేదని వాటికి మరమ్మతులు చేయించాలంటే.. బ్యాటరీ చెడిపోతే రూ.12వేలు, మిషన్ చెడిపోతే రూ.2.50 లక్షల వరకు ఖర్చవుతుందని దానికి సంబంధించిన ఇతర సామగ్రి సైతం చాలా ఖరీదుతో కూడుకున్నవేనని వాపోయారు. సంబంధిత ఉపకరణాలను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేసి ఆదుకోవాలని, లేకుంటే రాయితీ ధరలపై ప్రభుత్వం ఆధ్వర్యంలో సరఫరా చేయాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసినట్లు వారు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!
-
Devara: ‘దేవర’.. ఒక్క సంభాషణా కట్ చేయలేం.. పార్ట్ 2 ప్రకటించిన కొరటాల శివ
-
Rahul Gandhi: అమ్మకు రాహుల్ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..?
-
Supriya Sule: ‘హనీమూన్’ ముగియక ముందే.. మహా ప్రభుత్వంలో ముసలం?