logo

‘వైకాపా కార్యాలయంగా ఏయూ’

‘ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికార పార్టీ వైకాపా కార్యాలయంగా మారిపోయింది. ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి, నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన రిజిస్ట్రార్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ వర్సిటీని వైకాపా సేవలో తరింపచేస్తున్నారు.

Published : 08 May 2024 03:27 IST

సీతంపేట, న్యూస్‌టుడే : ‘ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికార పార్టీ వైకాపా కార్యాలయంగా మారిపోయింది. ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి, నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన రిజిస్ట్రార్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ వర్సిటీని వైకాపా సేవలో తరింపచేస్తున్నారు. వందలాది మంది తాత్కాలిక ఉద్యోగులు, ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌లను నియమించి వారితో వైకాపా ఎన్నికల పనులు చేయిస్తున్నారు. రిజిస్ట్రార్‌ ఏకంగా చర్చిలకు వెళ్లి వైకాపాకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నార’ని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు. విశాఖ పౌరగ్రంథాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.  నగరంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీసీ, రిజిస్ట్రార్‌లపై చర్యలు తీసుకుని బాధ్యతల నుంచి తప్పించాలన్నారు.  శ్యామలరాజ్‌ అనే వ్యక్తిని, ఎం.పి.విజయసాయిరెడ్డి మనిషిని ఏయూ సలహాదారులుగా నియమించారని ఆరోపించారు. వీరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు