logo

వేడుకగా కలశాల ప్రతిష్ఠ

చోడవరం స్వయంభూ విఘ్నేశ్వర ఆలయంలో గోపురాలు ప్రారంభోత్సవం, కలశాల ప్రతిష్ట వేడుకగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, విజయలక్ష్మి, జయదేవ్‌, గౌతమి దంపతులు యాగశాలలో పూజలు చేశారు.

Published : 08 Jun 2023 03:27 IST

కలశాలు తెస్తున్న విప్‌ ధర్మశ్రీ-విజయలక్ష్మి దంపతులు

చోడవరం, న్యూస్‌టుడే: చోడవరం స్వయంభూ విఘ్నేశ్వర ఆలయంలో గోపురాలు ప్రారంభోత్సవం, కలశాల ప్రతిష్ట వేడుకగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, విజయలక్ష్మి, జయదేవ్‌, గౌతమి దంపతులు యాగశాలలో పూజలు చేశారు. వీటిని సంప్రదాయంగా తలపై పెట్టుకుని ఆలయానికి తీసుకొచ్చారు. ఉదయం రాజగోపురం, గాలి గోపురాన్ని ధర్మశ్రీ ప్రారంభించారు. అనంతరం గోపురాలపై కలశాలను ప్రతిష్ఠించారు. శోభాయమానంగా శాస్త్రోక్తంగా నిర్వహించిన  ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున భక్తులు విచ్చేశారు. ఈ సందర్భంగా విప్‌ ధర్మశ్రీ మాట్లాడుతూ గౌరీశ్వరుడు, విఘ్నేశ్వరుడు స్వయంభూ ఆలయాలను రాష్ట్రస్థాయిలో ప్రాచుర్యం పొందేలా చేయడమే ధ్యేయమని చెప్పారు. ఆలయాల అభివృద్ధి చేపట్టే ప్రతి పనిలో స్థానికులు విరాళాలు అందజేసి సహకరించడం ముదావహమన్నారు. అనంతరం భారీ అన్న సమారాధనను నిర్వహించారు. కొడమంచిలి చలపతి సారథ్యంలో బులుసు ప్రభాకర శర్మ బృందం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ నున్న నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ ఈవో ఎస్‌.వి.వి.సత్యనారాయణమూర్తి, అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ పి.జయదేవ్‌, వడ్డాది నర్సింహమూర్తి, ఛైర్మన్లు గూనూరు సత్తిబాబు, కందర్ప శంకర్‌, సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని