logo

అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన

ఎన్నికల నామినేషన్‌ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది.  శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్‌ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్‌ వేయడంలో అడుగడుగునా కోడ్‌ ఉల్లంఘన కనిపించింది.

Published : 20 Apr 2024 03:45 IST

నామినేషన్‌ దాఖలులో అధికార పార్టీ ఇష్టారాజ్యం

గురుద్వారా, న్యూస్‌టుడే: ఎన్నికల నామినేషన్‌ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది.  శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్‌ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్‌ వేయడంలో అడుగడుగునా కోడ్‌ ఉల్లంఘన కనిపించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆర్వో కార్యాలయానికి 100 మీటర్ల దూరం నుంచే కేవలం అభ్యర్థితో పాటు ఐదుగురు మాత్రమే రావాలి. ఇక్కడ మాత్రం వందలాది మంది కార్యకర్తలు, నాయకులతో కార్యాలయం గేటు ముందుకు వచ్చేశారు. దీంతో అక్కడ స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. నామినేషన్‌ వేసే సమయంలో అభ్యర్థితో కలిపి ఐదుగురు మాత్రమే ఉండాల్సి ఉండగా.. ఏడుగురు పాల్గొన్నారు. ఇక్కడ పోలీసులు, స్థానిక ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం  కనిపించింది. కార్యాలయం గేటు ముందు ఎలాంటి ఊరేగింపులు చేయకూడదు. దాన్ని కూడా ఖాతరు చేయకుండా నామినేషన్‌ వేసి బయటకు వచ్చిన కేకే రాజును కార్యకర్తలు ఎత్తుకొని నినాదాలతో కాస్త దూరం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లడమే గాక కార్యాలయం సమీపంలో మీడియాతో మాట్లాడారు. ఇదంతా పోలీసుల కను  సన్నల్లోనే జరుగుతున్నా నిలువరించలేదు. అధికార పార్టీ నేతలకు దాసోహమయ్యారనే విమర్శలొచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని